ఎస్ ఆర్ టి వి అధినేత సింగం శెట్టి సత్తి రాజు పుట్టినరోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు..
జంగారెడ్డిగూడెం: కష్టపడి వృద్ధిలోకి వచ్చి సమాజంలో గుర్తింపు పొందిన వారితోపాటు పెద్దలను సేవా రంగంలో వున్న వారినీ గౌరవించడం ప్రతివారు ఆచరించవలసిన కనీస ధర్మా లని ఎస్ ఆర్ టి వి అధినేత సింగం శెట్టి సత్యనారాయణ(సత్తి రాజు) అన్నారు.
ఈ నెల 25వతేదీతన పుట్టినరోజు సందర్బంగా సత్తిరాజు తమ ఎస్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్ట నున్నట్టు తెలిపారు. ఉదయం 9గంటలకు ఏరియా హాస్పిటల్ లో ఇన్ పేషంట్ లుగా వున్న సుమారు 80 మందికి పళ్ళు, రొట్టె లు పంపిణీ చేయనున్నారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ, హాస్పిటల్ సూపరింటెడ్ తదితర పెద్దల చేతులు మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అలాగే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది మహిళ లు, పురుషులు దాదాపుగా 120 మందికి మున్సిపల్ కార్యాలయం వద్ద నూతన వస్త్రాలను అందించనున్నారు. తదుపరి పట్టణంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన తమ తమ రంగాల్లో పురోగతి సాధించిన సుమారు 25మందిని తమ ఎస్ ఆర్ టివి ఛానల్ తరఫున సత్కారం చేయాలని నిర్ణయించి నట్టు తెలిపారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేడు సమాజంలో పది మందికీ ఆదర్శంగా నిలిచిన వారిని గుర్తించి కుల మతాలకు అతీతంగా చిరు సత్కారం చేస్తున్నామని సత్తి రాజు చెప్పారు.


.jpeg)
