Ticker

6/recent/ticker-posts

కార్మికులకు బట్టలు ఇస్తున్న బత్తిన చిన్నాతో దాత సత్యరాజ్



ఘనంగా సేవా స్ఫూర్తి ప్రదాత సింగం శెట్టిసత్యరాజ్ జన్మదిన వేడుకలు
మున్సిపల్ కార్మికులకు బట్టలు, ఏరియా హాస్పిటల్ లో పళ్ళు, రస్కులు పంపిణీ
పాల్గొన్న  బత్తిన చిన్నా, జెడ్పిటిసి బాబ్జి, కౌన్సిలర్ లు ప్రముఖులు


జంగారెడ్డిగూడెం: శ్రమైక జీవనసౌందర్యానికి సమానమైనది లేనేలేదన్న మహకవి శ్రీ శ్రీ మాటలు ప్రతి వారు గుర్తుచేసుకోవాలని స్థానిక ఎస్ ఆర్ టి వి అధినేత సింగం శెట్టి సత్యరాజ్ అన్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్బంగా మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇచ్చారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పళ్ళు వగైరా పంచారు. 120 మంది పారిశుధ్య కార్మికులకు వైసీపీ నాయకుడు బత్తిన చిన్న తదితర ప్రముఖ నేతల చేతుల మీదుగా నూతన వస్త్రాలు బహుకరించారు. పురుషులకు ప్యాంట్ షర్ట్, మహిళలకు చీర జాకెట్టు ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బత్తిన చిన్నా మాట్లాడుతూ... సేవారంగం గురించి అవగాహన కలిగినమిత్రుడు సత్యరాజ్ మున్సిపాలిటీలో పని చేసే వారిని గుర్తించి కొత్త బట్టలు ఇవ్వడం సంతోషం అన్నారు. 



గత ఐదు ఏళ్లగా సత్తి రాజు సేవా కార్యక్రమాలు..
ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్ పి టిసి పోల్నాటి బాబ్జి మాట్లాడుతూ.. పుట్టినరోజు సందర్బంగా సాధారణంగా ఎవరికీ వారు హార్భాటాలలు చేసి గొప్పలు చెప్పు కుంటారని కానీ, మిత్రుడు సత్యారాజ్ ఈ విధంగా కార్మికులను గుర్తించి వారికి కొత్త బట్టలను పంచి పెట్టడం ముదావహం అని స్థానిక జెడ్ పి టిసి పోల్నాటి బాబ్జిప్రసంశించారు. ఇటువంటి వారు అరుదు అన్నారు. 

ఆడిటర్ దాకారపు కృష్ణ దుస్సాలువ తో సత్తి రాజును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సత్యరాజ్, ఆయన కుమారుడు నాని తదితరులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 80 మంది ఇన్ పేషంట్లకు పళ్ళు, రస్కులు వగైరా ఇచ్చారు. 

సత్యరాజ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా స్థానికంగా సామాన్య స్థాయి నుంచి ఎదిగిన సుమారు 20 మందికి సత్కారం చేయనున్నట్టు తెలిపారు. 

కార్యక్రమాల్లో  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మర్రి వెంకటేశ్వరరావు, సినీ డైరక్టర్ బి. ప్రసాద్ రాజు, మానవత చైర్మన్ అల్లూరి రామకృష్ణ, జిల్లా కన్వీనర్ త్రిపుర, సీనియర్ జర్నలిస్ట్ కె ఎస్ శంకర రావు, ప్రముఖ ఆడిటర్ దాకారపు కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ లు వలవల తాతాజీ, వాసు, జెట్టి ఉమా, కొంచాడ సాగర్, కళ్లెం గంగ రాజు, దేవేందర్ రెడ్డి, రమణా రెడ్డి, శ్రీనివాసులు, మోటేపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

తమను గుర్తించి బట్టలు ఇచ్చిన సత్య రాజ్ కు ఎ ఐ టి యు సి నాయకుడు రేలంగి నాగ రాజు కృతజ్ఞతలు తెలిపారు.