INDIA, ఢిల్లీ: గురువారం నగరంలోని ద్వారకలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో యాంటీ నార్కోటిక్స్ సెల్ కు, హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అంకిత్‌కు మధ్య కాల్పులు జరగ్గా.. అతని కుడి కాలుకు బులెట్ తగిలింది. ఈ ఎన్ కౌంటర్(Delhi police encounter) తర్వాత అంకిత్ ను యాంటీ-నార్కోటిక్స్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. గత నెల చివర్లో రోహిత్ లాంబాపై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. హిమాన్షు భావు గ్యాంగ్( Himanshu Bhavu gang) ఈ విషయంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు ప్రధాన షూటర్లు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
పరారీలో ఉన్న నిందితులను అంకిత్, దీపక్ లుగా అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులపై ఢిల్లీ పోలీసులు రూ. 25 వేలు (Delhi police reward) రివార్డును ప్రకటించారు. గురువారం నజాఫ్‌గఢ్‌లోని సాయిబాబా మందిర్ సమీపంలోకి నిందితుల్లో ఒకడైన అంకిత్ వస్తున్నట్లు ద్వారకాలోని యాంటీ నార్కోటిక్స్ సెల్ బృందానికి సమాచారం అందింది.
దీంతో ఈరోజు ఉదయం 8:00 గంటల సమయంలో అంకిత్ బైక్ పై వస్తుండగా పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించి పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఓ పోలీసు కానిస్టేబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను తాకింది. ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిందితుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి(police bullet injury) గాయమైంది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


.jpeg)
