సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా: అంతర్జాతీయ డిజిటల్ సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు(Bhimavaram cybercrime bust) రట్టు చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మకు సిమ్ కార్డు వచ్చిందని, సీబీఐ అధికారులమని సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. సిమ్ కార్డు తేడా ఉందని తాము సరి చేస్తామంటూ ఆయనకు తెలిపారు. అనంతరం డిజిటల్ అరెస్ట్(digital fraud) చేస్తున్నామని కూడా శర్మను బెదిరించారు. భయపడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సైబర్ మోసగాళ్లకు శర్మ తెలిపాడు. దీంతో13 రోజుల వ్యవధిలో శర్మ ఖాతాలో ఉన్న రూ.78 లక్షలు సైబర్ ముఠాను కాజేసింది. దీంతో బాధితుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన భీమవరం రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 14 మంది నిందితులుగా పోలీసులు( Bhimavaram police investigation) గుర్తించారు. 13 మందిని అరెస్టు చేయగా.. ప్రధాన సూత్రధారి రహతే జె నయన్ పరారీలో ఉన్నాడు. నిందితులు కార్డ్ డీల్ పద్ధతి ద్వారా భారతీయుల బ్యాంకు ఖాతాలను సేకరించి కాంబోడియాకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచే బాధితులకు డిజిటల్ అరెస్టుల(Digital Arrest) పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రూ. 42 లక్షల నగదు రికవరీ చేసిన పోలీసులు.. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.19 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. అంతర్జాతీయ సిమ్ కార్డులతో కూడిన 15 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


.jpeg)
