Ticker

6/recent/ticker-posts

పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!


INDIAN:ప్రస్తుతం రాష్ట్రంలో HIV కేసులు పెరుగిపోతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రాష్ట్రంలోని యువతీయువకులు పెళ్లికి ముందు HIV టెస్టు చేసుకోవడం తప్పనిసరి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో ఇటీవల జన్మించిన శిశువుల్లో 400 మందికి HIV పాజిటివ్ అని తేలడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మేఘాలయా రాష్ట్రంలో ప్రస్తుతం HIV కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మేరకు వివాహానికి ముందు హెచ్‌ఐవీ పరీక్షను తప్పనిసరి చేయడాన్ని మేఘాలయ ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో హెచ్‌ఐవీ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే మేఘాలయా ఆరోగ్య శాఖ మంత్రి అంపరీన్ లింగ్డోహ్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి అని ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విధానం గోవాలో అమలవుతోందని ఈ చట్టం ద్వారా తమ సమాజాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల 400 మంది శిశువులు HIV వైరస్ తో జన్మించారని ఆరోగ్య శాఖ మంత్రి అంపరీన్ లింగ్డోహ్ తెలిపారు. 2028 వరకు రాష్ట్రంలో ఏ శిశువు కూడా హెచ్ఐవీ వైరస్ తో జన్మించకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. హెచ్‌ఐవీ సరైన చికిత్సతో నియంత్రించవచ్చని, ఇది క్యాన్సర్ లేదా టీబీ లాంటిదేనని మంత్రి పేర్కొన్నారు.

ఇక ప్రస్తుతం దేశంలో అత్యధిక HIV కేసులు ఉన్న రాష్ట్రాల్లో మేఘాలయా ఆరో స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనే హెచ్ఐవీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 2023 నాటికి దేశంలో 25 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు సమాచారం.