Ticker

6/recent/ticker-posts

విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి అలర్ట్- 53 రైళ్ల రద్దు, మరో 50 దారి మళ్లింపు..!


ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్- ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో వివిధ తేదీల్లో మొత్తం 53 రైళ్లు పూర్తిగా, పాక్షికంగా రద్దు కాగా.. మరో 50 రైళ్ల రాకపోకల్ని దారి మళ్లించారు. మరికొన్ని రైళ్ల రాకపోకల్ని క్రమబద్ధీకరించారు. విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మార్పులు తప్పనిసరిగా గమనించి టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ముందుగా ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ, తిరిగి ఆగస్టు 6 నుంచి 24వ తేదీ వరకూ రద్దయిన రైళ్లలో విజయవాడ నుంచి ఒంగోలు, తెనాలి, బిట్రగుంట, గుంటూరు, రేపల్లె-తెనాలి, గుంటూరు-రేపల్లె, గూడూరు, రేపల్లె-మార్కాపురం రోడ్డు, సికింద్రాబాద్-గూడూరు, తిరుపతి-లింగంపల్లి, లింగంపల్లి-తిరుపతి, నరసాపురం-ధర్మవరం, రేణిగుంట-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, విశాఖ-తిరుపతి, యస్వంత్ పూర్-తుగ్లకాబాద్, రోయాపురం-పటేల్ నగర్, తిరుపతి-నర్సాపూర్, జల్నా-తిరుపతి, చర్లపల్లి-తిరుపతి రైళ్లు ఉన్నాయి. అలాగే కాచిగూడ-రేపల్లె, రేపల్లె-సికింద్రాబాద్, చర్లపల్లి-రేపల్లె, రేపల్లె-వికారాబాద్ రైళ్లు పాక్షికంగా రద్దు, తాత్కాలిక స్టాపుల రద్దు ఉన్నాయి.

అలాగే ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకూ పలు రైళ్లను దారి మళ్లించారు. వీటిలో షాలిమార్-చెన్నై, హౌరా-బెంగళూరు, నిజాముద్దీన్-ఎర్నాకుళం, నిజాముద్దీన్-ఎండీయూ, జోథ్ పూర్-చెన్నై, రేణిగుంట-నిజాముద్దీన్, అయోధ్య-రామేశ్వరం, ఖరగ్ పూర్-విల్లుపురం, సంత్రగచ్చి-మంగళూరు, జసిధి-బెంగళూరు, పురూలియా-తిరునల్వేలి, నిజాముద్దీన్-త్రివేండ్రం, న్యూజల్పాయ్ గురి-చెన్నై, హౌరా-తిరుపతి, పూరీ-చెన్నై, అగర్తల-బెంగళూరు, గయా-చెన్నై, సంత్రగచ్చి-తిరుపతి, గోరఖ్ పూర్-కొచ్చువేలీ, మధురై-చండీఘర్, తిరుపతి-భువనేశ్వర్, ధన్ బాద్-అలప్పుజ మధ్య వెళ్లే రైళ్లు ఉన్నాయి.

అలాగే భగత్ కీ కోటీ-చెన్నై, చెన్నై-అహ్మదాబాద్, కన్యాకుమారి-దిబ్రూఘర్, మధురై-నిజాముద్దీన్, ఎర్నాకులం-హౌరా, ఇండోర్-కొచ్చువేలీ, బెంగలూరు-న్యూ తిన్ సుఖియా, చెన్నై-విశాఖ, విశాఖ-లింగంపల్లి, తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, త్రివేండ్రం-సికింద్రాబాద్, ఎస్వీడీ కట్రా-చెన్నై, రేణిగుంట-నిజాముద్దీన్, చెంగల్పట్టు-కాకినాడ, పుదుచ్చేరి-కాకినాడ, చెన్నై-విజయవాడ, చెన్నై-చర్లపల్లి, హైదరాబాద్-కొల్లం మధ్య తిరిగే రైళ్లు ఉన్నాయి. మరో 15 రైళ్ల సమయాల క్రమబద్ధీకరణ, అలాగే ఇంకో నాలుగు రైళ్లను రీషెడ్యూల్ కూడా చేశారు. కాబట్టి ప్రయాణికులు వీటికి అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.