ఇక గుంటూరు జిల్లాలో సీనియర్లు అనేక మంది కమ్మ సామాజిక వర్గంలో మంత్రి పదవి కోసం చూస్తున్నారు.
ANDHRAPRADESH:ఏపీలో కీలకమైన జిల్లాగా క్రిష్ణా ఉంది. దీనిని రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేర్కొంటారు. క్రిష్ణా జిల్లా నాడిని పట్టుకుంటే చాలు మొత్తం అర్థం అవుతుంది అని చెబుతారు ఏపీలో రాజకీయ రాజధానిగా క్రిష్ణాకు పేరుంది.
అటువంటి జిల్లాలో రాజకీయంగా ఆధిపత్యం చేసే సామాజిక వర్గంగా కమ్మలు ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ జిల్లా నుంచి వారికి బెర్త్ గ్యారంటీ. ఆఖరుకు జగన్ హయాంలో సైతం మూడేళ్ళ పాటు ఈ జిల్లా నుంచి కొడాలి నాని మంత్రిగా పనిచేశారు.
అయితే 2024లో మాత్రం సీన్ మారింది. ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. ఆ ఇద్దరూ బలమైన బీసీ నేతలే కావడం విశేషం. వారిలో ఒకరు సీనియర్ నేత కొలుసు పార్ధసారధి అయితే మరొకరు కొల్లు రవీంద్ర.
ఈ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కడంతో కమ్మ సామాజిక వర్గానికి బెర్త్ లేకుండా పోయింది. ఇక మంత్రి పదవి విషయంలో ఆశలు పెట్టుకున్న వారిలో టీడీపీ నుంచి వసంత క్రిష్ణ ప్రసాద్ ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి తొలిసారి 2019లో గెలిచారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారు. రెండోసారి అలా గెలిచారు ఆయన వైసీపీలోనే మంత్రి పదవి మీద ఆశపడినా కుదరలేదు.
ఇక కూటమి ప్రభుత్వంలో గ్యారంటీ అనుకున్నా అదేంటో అందలం అందలేదు. గన్నవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఆయన కూడా రేసులోనే ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే సీనియర్ నేత వల్లభనేని వంశీని ఆయన ఓడించారు కాబట్టి. ఇక బీజేపీ నుంచి సీనియర్ నేత కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహించిన సుజనా చౌదరి ఉన్నారు.
ఇక గుంటూరు జిల్లాలో సీనియర్లు అనేక మంది కమ్మ సామాజిక వర్గంలో మంత్రి పదవి కోసం చూస్తున్నారు. వారిలో ఈ మధ్యనే ఎమ్మెల్సీ అయిన ఆలపాటి రాజా ఉన్నారు. అలాగే ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాస్ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కమ్మ నేతలు మంత్రులుగా ఉన్నారు. ఒకరు నారా లోకేష్ మరొకరు నాదెండ్ల మనోహర్. దాంతో ఈ ఇద్దరి బెర్తులు కదలవు కాబట్టి కొత్తగా కమ్మ వారికి చాన్స్ ఉండదనే అంటున్నారు.
అదే విధంగా క్రిష్ణా జిల్లాలో కూడా మంత్రి వర్ర్గ విస్తరణ జరిగినా కూడా వారి ఆశలు నెరవేరవని అంటున్నారు. ఇక ఏపీ కేబినెట్ లో చంద్రబాబు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమర్ ఉన్నారు. మొత్తం మంత్రివర్గంలో ఇరవై శాతం వాటా అన్న మాట. వీరిలో ఎవరూ కదిలేది లేదు. దాంతో ఏపీలో కొత్తగా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరూ ఆశలు పెట్టుకోవాల్సింది ఉండదని మరో నాలుగేళ్ళు ఇలాగే గడిపేయడానికి రెడీ కావాల్సిందే అని అంటున్నారు.
Social Plugin