అవును... సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసుకునే పనుల్లో బిజీగా ఉంటున్నారు.
HYDERABAD:సోషల్ మీడియాలో జరిగే ప్రచారాల సంగతి తెలిసిందే. అందులో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకునేసరికి వ్యవహారం చేతులు దాటిపోతుంటుందని అంటారు. ఈ క్రమంలో ఓ బట్టల వ్యాపారి అత్యుత్సాహంతోనో.. లేక, బిజినెస్ టెక్నిక్ లో భాగంగానో ఓ ప్రకటన చేశారు. అది కాస్తా స్థానికంగా సంచలనంగా మారడంతో.. వ్యవహారం చినిగి చేటయ్యి.. పోలీసుల ఎంట్రీ వరకూ వెళ్లింది.
అవును... సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసుకునే పనుల్లో బిజీగా ఉంటున్నారు. అయితే అందులో కొన్ని సహేతుకంగా ఉండటంతో సక్సెస్ అవుతుంటే.. మరికొన్ని మాత్రం తేడా కొట్టి మొదటికే మోసం తెస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రూ.2 కే షర్ట్ అని ప్రకటించిన షాప్ యజమానికి షాక్ తగిలింది.
వివరాళ్లోకి వెళ్తే... మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ బట్టల షాపు యజమాని.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా.. కేవలం 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం చేశాడు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకూ మాత్రమే ఈ ఆఫర్ అని ఓ కండిషన్ కూడా పెట్టాడు.
దీంతో.. దీనికి సంబంధించిన పోస్ట్ ని నెటిజన్లు తెగ షేర్ చేసుకున్నారంట. దీంతో.. సోమవారం ఉదయం 11 గంటలకంటే ముందే షాపు వద్దకు యువకులు క్యూ కట్టారు. దీంతో... పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పెద్ద తోపులాటే జరిగింది. దీంతో ఆ షాపు యజమాని బెంబేలెత్తిపోయాడు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా పరిస్థితి మారింది.
దీంతో... షాపు క్లోజ్ చేసి పరారయ్యాడు. దీంతో... షాపు ముందు యువకులు పెద్ద ఎత్తున గుమిగూడి హల్ చల్ చేశారు! ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ షాపు వద్ద గుమిగూడిన యువకులను చెదరగొట్టారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, షాప్ ఓనర్ కోసం గాలిస్తున్నారని తెలుస్తోంది.
Social Plugin