Ticker

6/recent/ticker-posts

రెడ్ క్రాస్ సంస్ధ ద్వారా మెరుగైన సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు: రెడ్ క్రాస్ సేవలను ఇంకా విస్తరింపచేసి రెడ్ క్రాస్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెడ్ క్రాస్ నూతన కార్యవర్గానికి సూచించారు.  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ నూతన చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం స్ధానిక కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్ మరియు ఏలూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  


రాబోయే రోజుల్లో జిల్లాలోని రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేసేలా, రెడ్ క్రాస్ సభ్యత్వాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి వంటి విషయాలను నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్ ఈ సందర్బంగా చర్చించారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ ముందుండేలా నూతన కమిటీ పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, మేతర అజయ్ బాబు, ఎంవివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.