జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: స్వతంత్ర సమర యోధుడు అగ్గి పిడుగు అల్లూరి సీతా రామరాజు 101వర్ధంతిని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కె మహబూబ్ సుభాని అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లోజిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ స్థానిక కొత్త బస్టాండ్ సమీపానగల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో సూర్య కిరణ్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపారని పేర్కొన్నారు. సీతారామరాజు అటవీ ప్రాంతంలో నాగరికతకు దూరంగా ఉన్న ఆదివాసీలను ఐక్యం చేసి వారి హక్కులకై పోరాడిన యోధుడని కొనియాడారు. సూర్యుడ స్తమించని సామ్రాజ్యం అంటున్న బ్రిటిష్ సామ్రాజ్యం పై రెండు సంవత్సరాల కాలంపోరాడి బ్రిటీష్ పరిపాలకులను గడగడలాడించాడని గుర్తు జేశారు.
అతి చిన్న వయసులోనే దేశం పట్ల ప్రజల పట్ల సీతారామరాజుకు ఉన్న దేశభక్తిని దేశంలోని యువతీ యువకులు స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కులకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అలాగే సీతారామరాజు వంటి మహనీయుల ఆశయాలతో దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులు మతవిద్వేషాలను అరికట్టాలని కోరారు.
నిరంతరం పెరుగుతున్న నిరుద్యోగసంక్షోభాన్ని, అరికట్టి భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతరం బలహీనులపై జరుగుతున్న దాడులు అరికట్టడమే అల్లూరి
కిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి దేశం కోసం దేశ ప్రజల కోసం గిరిజనులకోసం ప్రాణాలు పణంగా పెట్టిన యోధుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.జీవరత్నం, ఏ ప్రభాకరరావు, పోతురాజు, బి నాని, సునీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin