Ticker

6/recent/ticker-posts

పేదల ఇళ్ల పధకంలో ప్రారంభించిన ఇళ్లను జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలి: మంత్రి కొలుసు పార్థసారథి


ప్రణాళిక బద్ధంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిబద్ధతతో పనిచేయాలి 
ఉద్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు 
ఇంటి స్థలం ఇంకా స్వాధీనం కానివారికి  కొత్త నిబంధనల ప్రకారం 3 సెంట్లు మంజూరు చేస్తాం 
రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి 



ఏలూరు/నూజివీడు:  నూజివీడు  నియోజకవర్గంలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలని   రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. 

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ ప్రగతిపై హౌసింగ్, డ్వామా, ఆర్ డబ్ల్యూ ఎస్,డి ఆర్ డి ఏ, ఏపీ ఇపిడిసిఎల్,సర్వే, మెప్మ, ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ మరియు నియోజకవర్గం లోని నాలుగు మండలాల తహశీల్దార్లు,యం పి డి వో లు తదితరులు.అధికారులతో మంత్రి పార్థసారథి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అర్హుడైన ప్రతీ పేదవాడికి స్వంత ఇంటిని మంజూరు చేస్తామన్నారు.  వేసవి సమయం నిర్మాణ పనులకు అనుకూలమైనదని , కావున  పేదలకు స్థలం మంజూరుచేసి, ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఇళ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదల గృహ నిర్మాణ పధకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన నిధులను సక్రమంగా వినియోగించలేదన్నారు.  

గత ప్రభుత్వ సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు  ఇళ్ల కోసం  2 సెంట్లు భూమి మంజూరు చేసి, ఇంకా భూమిని లబ్దిదారులకు భూమిని స్వాధీనం చేయని వారికి, కొత్తగా నిబంధనల ప్రకారం 3 సెంట్లు భూమిని ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేయాలనీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి  ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక, సబ్సిడీ పై సిమెంట్, వంటి నిర్మాణ సామాగ్రి గురించి లబ్దిదారులకు తెలియజేసి, ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా లబ్దిదారులను ప్రోత్సహించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతీ లబ్దిదారుడిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని  మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. నియోజక వర్గంలోని నాలుగు మండలాలతో పాటు నూజివీడు పట్టణంలో  నిర్మించే గృహ నిర్మాణాల ప్రగతి పనులపై ఒక్కొక్కటిగా అధికారులతో  మంత్రి సమీక్షిస్తూ పనులు పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గృహనిర్మాణం పై కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకుని రాగా తక్షణమే వాటి పరిష్కారం మార్గం చూడలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 

ప్రణాళిక బద్ధంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిబద్ధతతో పనిచేయాలన్నారు.నియోజకవర్గంలో  గతంలో తాము ఇచ్చిన   ఇళ్ల నిర్మాణ స్కీం టార్గెట్ ఎందుకు పూర్తి చేయలేక పోయారని అధికారులను నిలదీశారు. నిర్ధేశించిన సమయానికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే తగిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.నియోజక వర్గంలో  ఎన్ని ఇళ్ళు నిర్మించారు, ఇంకా ఎన్ని నిర్మించవలసి ఉంది  సమగ్ర వివారాలు అందించాలన్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పధకాలను లబ్ధిదారులకు సకాలంలో అందజేయకపోతే అంతిమంగా లబ్ధిదారుడు నష్టపోతాడని ఇచ్చిన టార్గెట్ నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో అలసత్యం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి నగదు  సకాలంలో అందించాలని సరైన సమయంలో సొమ్ము అందకపోతే ఇళ్ళు నిర్మించే లబ్దిదారుడు నష్టపోతాడని ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకుండా చూసే బాధ్యత మీదేనన్నారు. జిల్లా గృహనిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమన్వయంతో అందరూ కలసి పనిచేసి మీకు ఇచ్చిన టార్గెట్ను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని  గృహనిర్మాణ అధికారులను ఆదేశించారు. 

గ్రామనాయకులు జాగ్రత్త వహించి లబ్ధిదారుకు సకాలంలో గృహాలు నిర్మించేలా పర్యావేక్షణ చేయాలన్నారు, నిబంధనలు అనుసరించి పక్కా గృహాలు నిర్మించాలని అధికారులకు ఆదేశించారు, ఎస్, సి, బి, సి,లకు అదనంగా రూ,50 వేలు ప్రభుత్వం అందిస్తుందని గృహాలు నిర్ణీత సమయంలో నిర్మించాలని అధికారులకు చూసించిన మంత్రి,లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక  తో పాటు డ్వాక్రా మహిళలకు అదనంగా రూ,35 వేలు ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొనే విధంగా లబ్ధిదారులకు అధికారులు అవగహన కల్పించాలని మంత్రి ఆదేశించారు, ప్రధానిమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్మించే గృహా నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని మంత్రి అన్నారు. 

పేదవారికి సకాలంలో పథకాలు  అందించే బాధ్యత ప్రభుత్వ అధికారుల పై ఉందని మంత్రి పేర్కొన్నారు, క్షేత్ర స్థాయిలో పరిశీలించి హర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  ఆర్హులైన అందరికీ ఇంటి ఋణం మంజూరు చేయాలని అధికారులకు సూచించారు, అర్హత లేకుండా ఇంటి స్థలం పొందిన పట్టాలన్ని రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు,కొత్తగా నిర్మించే గృహాలకు విద్యుత్,రహదారులు, మంచినీటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు సకాలంలో అందేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు, విధి నిర్వహణలో అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి, స్మరణ్ రాజ్, హౌసింగ్ అర్బన్ ఎస్ ఈ ఎం. కృష్ణయ్య, గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ జి.వి.వి.సత్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి ఆర్.విజయరాజు, అర్ డాబ్ల్యూఎస్ ఎస్ ఈ  సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రభుత్వ అధికారులు, వర్క్ ఇన్స్పెక్టర్లు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.