మురళీ నాయక్ తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరు చూసిన వారికి కంట తడి పెట్టించింది. పవన్ కళ్యాణ్ తాను సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక మురళీ నాయక్ తండ్రి అయితే ఒరేయ్ మురళీ లేవరా నీకు ఎంతో ఇష్టమైన పవన్ సార్ వచ్చారురా అంటూ భౌతిక కాయం ముందు రోదించిన తీరు కూడా అందరినీ విషాదం లోకి నెట్టింది. పవన్ అయితే మురళీ నాయక్ తండ్రిని ఓదార్చి తన భుజానికి హత్తుకుని ఎంతోగానో సేద తీర్చారు. నిజంగా ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ వ్యవహరించారు. తాను ఒక రాజకీయ పార్టీ అధినేతను అని కానీ ఉప ముఖ్యమంత్రిని అని కానీ వెండి తెర మీద పవర్ ఫుల్ స్టార్ అని కానీ ఎక్కడా పవన్ కనిపించలేదు.
కన్నీటిని తుడిచే చల్లని హస్తంగానే మారిపోయారు. వారు బాధలకు ఓదార్పు అయ్యారు. వారు గుండె కోతకు తాను ఒక మందుగా నిలిచారు. నిజంగా పవన్ ని చూస్తే పరామర్శ అంటే ఇది కదా అనిపించకమానదు. అంతే కాదు పవన్ కళ్యాణ్ తన వంతుగా వ్యక్తిగతంగా పాతిక లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించడం కూడా ఆయన మనసు ఎంత వెన్నముద్ద అనడానికి మరో ఉదాహరణ. ఈ రోజులలో ఎవరు సొంత డబ్బులు తీస్తున్నారు అన్న ప్రశ్నలు ఇక్కడే వస్తున్నాయి. ఎంత డబ్బు ఉన్నా పైసా తీయాలంటే మనసు మూలుగుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ మాత్రం ఎడమ చేయికి తెలియకుండా కుడి చేతితో ఇచ్చిన దానాలు ఎన్నో కదా అనిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఇస్తే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అందులో సగం ఇచ్చారు అంటే పవన్ మానవత్వంలో ఎంత ఎత్తుకు ఎదిగారో అర్ధం అవుతుంది.
పవన్ ని రాజకీయ నాయకుడు అనలేరు ఆయన జనం గుండె చప్పుడు వినే మంచి మనిషి అనడమే బాగుంటుంది. ఆయనకు పదవుల మీద వ్యామోహం లేదని అందరికీ తెలుసు. అంతే కాదు ఆయన డబ్బు మీద కూడా ఏ మాత్రం ఆసక్తి ఆశ లేవు. కానీ పవన్ కి పదవులు ఉండాలి నిండుగా డబ్బులు కూడా ఉండాలి. ఎందుకంటే అవి అతని కోసం కాదు, ప్రజల కోసం. ఆపన్నుల కోసం. అందుకేనేమో పవన్ ఇ అలా వద్దన్నా పదవి ఇచ్చి ఆ దేవుడి ప్రజల కోసమే అలా ఎదుట నిలబెట్టాడు అనిపిస్తుంది. మొత్తానికి పవన్ సారూ మీరు గ్రేట్ అనాలనిపిస్తోంది తాజా సన్నివేశాలు చూసిన అందరికీ.