Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఘనంగా ఉగాది ఉత్సవాలు


*సంప్రదాయబద్ధంగా "శ్రీ విశ్వావసు" నామ సంవత్సర "ఉగాది" ఉత్సవాలు
*: కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,జిల్లా అధికారులు..
*: సంప్రదాయ వస్త్రాలైన తెల్ల చొక్కా, పంచెకట్టు, కండువాలు ధరించి హాజరైన పలువురు జిల్లా అధికారులు ..
*: ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి సేవనం, కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ఉగాది ఉత్సవాలు నిర్వహణ..
*: అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకెళ్లేందుకు కృషి
*: జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు లోని గిరిజన భవన్ లో ఆదివారం ఉగాది వేడుకలు - 2025 కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఘంట పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, డి ఆర్ వో వి. విశ్వేశ్వరరావు, ఐ టి డి ఏ పిఓ రాములు నాయక్, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబారీష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సంప్రదాయ వస్త్రాలైన తెల్ల చొక్కా, పంచెకట్టు, కండువాలు ధరించి పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. 
అనంతరం గిరిజన భవనంలో ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించి జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి ప్రారంభించారు. 

తదనంతరం నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్య బృందం, ఐటీడీఏ కి చెందిన బాలికలు, నిర్వహించిన సాంస్కృతిక ఆకట్టుకున్నాయి. 

ఆ తరువాత జటావల్లభూల సాయిరాం ఆధ్వర్యంలో ఇలింద్ర పర్తి శ్రీనివాసరావు, డాక్టర్ విప్పర్తి ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి, పట్టా సుదర్శనాచార్య లతో కవి సమ్మేళనం ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం శ్రవణానందంగా సుదర్శన శ్రీనివాస ఆచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాస్త్రోక్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది ఉత్సవాలు ఏర్పాటు చేశామన్నారు.

ఉగాది వేడుకల్లో చాలామంది అధికారులు ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావడం ఆనందంగా ఉందని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఉగాది వంటి పండుగలు నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సాంప్రదాయాలు మన మూలాలను మర్చిపోకుండా ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకుంటున్నామన్నారు. ఉగాది వేడుక ప్రాంగణాన్ని మామిడి అరటికాయలు చెరుకుగడలతో చక్కగా అలంకరించుకోవడంతోపాటు ఆంధ్ర కల్చర్ తో చాలామంది దోతీలు చీరలు ధరించి వేడుకలకు హాజరవ్వడం హర్షదాయకమన్నారు. 

ప్రజలకు సహాయకారిగా ఉంటూ ప్రజాసేవ ద్వారా గౌరవం పొందటమే నాకు అత్యంత తృప్తిని కలిగిస్తుందని అన్నారు. ఆ దిశగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. 3వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అత్యంత తొందరగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు చిత్తశుద్ధితో వేగంగా పనిచేయాలన్నారు. 

అన్ని రంగాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. గత ఏడాది కంటే మరింత మెరుగైన క్రమంలో ప్రజలకు సేవలు అందించేందుకు తనతో పాటు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ అమలు చేసే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నూరు శాతం ప్రజలకు చేరవేస్తామని ఆమె స్పష్టం చేశారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ లకు, వేద పండితులు, అర్చక స్వాములు సుదర్శన శ్రీనివాసచార్యులు, గూడూరు శ్రీనివాసరావు కందుకూరి రామ బ్రహ్మానందం తుములూరు వెంకట నాగ శ్రీధర్ శాస్త్రి లచే వేదఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఆర్ విజయ రాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, సెట్వెల్ సీఈవో ప్రభాకర్, ఉద్యాన శాఖ డిడి ఎస్ రామ్మోహన్. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, డీఈవో పి. లక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి.శారద, డిపిఆర్ఓ ఆర్ వి ఎస్ రామచంద్రరావు, ఇరిగేషన్ ఎస్ ఈ పి. నాగార్జున రావు, డాక్టర్ మల్లికార్జునరావు, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.