Ticker

6/recent/ticker-posts

దత్తత తీసుకున్న పిల్లలను కంటికి రెప్పలా చూడండి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.


ఏలూరు: దత్తత తీసుకున్న పిల్లలను కంటికి రెప్పలా చూడటంతోపాటు వారిని విద్యావంతులుగా చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్ధానిక కలెక్టరేట్ లో కారా నియమ నిబంధనల ప్రకారము 13 సంవత్సరాల వయసు కలిగిన విల్సన్ పాల్@సాయికిరణ్ అనే బాబుని కేరింగ్స్ పోర్టల్ ద్వారా అదిలాబాద్ జిల్లాకు చెందిన దత్తతకు ఆర్జి చేసుకునీ మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి వారి సమక్షంలో దత్తత ఇవ్వడం జరిగింది. 


ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెద్ద పిల్లలను దత్తత తీసుకోవటానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ దత్తత తీసుకున్న పిల్లలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాగా చదివించి వారి వారి ఇష్టాలను గౌరవించి వారికి ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తారో ఆ రంగంలో వారికి విద్యాబోధనలు చెప్పించి వారిని ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి , హోమ్ పర్యవేక్షణ అధికారిణి  శ్రీవల్లి,  శిశు గృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.