Ticker

6/recent/ticker-posts

గొల్లమందల శ్రీనివాస్ ను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్


ELURU: హార్ట్ స్ట్రోక్ తో విజయవాడ వైవి రావు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెం మండల తెదేపా ఎస్ సి సెల్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్ ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం రాత్రి  పరామార్సించారు. గత కొద్ది రోజులుగా విజయవాడ 44వ డివిజన్ లో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న రోషన్ కుమార్ శ్రీనివాస్ ఆరోగ్యం గురించి వాకబు చేసారు.

విజయవాడలో వున్నట్టు తెలిసి హాస్పిటల్ కు వెళ్లి ధైర్యం చెప్పారు. వరద సహాయక కార్యక్రమాల్లో నిమగ్నం అయి కూడా ఎమ్మెల్యే రోషన్ కుమార్ సొంత నియోజకవర్గంలో కార్యకర్తల యోగ క్షేమంగుర్రించి ఆలోచన చేయటం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పలకరించి నేనున్నానని భరోసా ఇవ్వడం పై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.