Ticker

6/recent/ticker-posts

సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ


ఏలూరు: సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కాగా ఉండాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర రాజధాని నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాలన్నింటిని పూర్తి చేయాలన్నారు.  

           
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ ఏలూరు జిల్లాలో 98.68% పూర్తయిందన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలకోసం 82,851 దరఖాస్తులు ఇప్పటివరకు అందాయన్నారు. వాటిలో 2453 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలు, తహశీల్దార్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి వున్న క్లైయిమ్ లను ఈనెల 3వ తేదీలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియకు సంబంధించి మిగిలివున్న వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు. 

డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు(డిఎస్ఇ) సంబంధించి కూడా ఉన్న పెండింగ్ లు పూర్తి చేసే వెంటనే వివరాలు అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.  ఈ అంశాలన్నింటిని యుద్ధప్రాతిపధికపై పూర్తిచేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి డి. పుష్పమణి, ఇఆర్ఓలు, కె. సుబ్బారావు, కె. భాస్కర్, యం. ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.