Visakhapatnam: మండుటెండలను సైతం లెక్క చేయ కుండా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికై అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రంప చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థినీ మిరియాల శిరీష దేవి ప్రచారంలో అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుకమాఫియా, ,భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేశారా అని ప్రజలను ప్రశ్నించారు..
రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు నాలుగు రేట్లు పెరిగాయని, మద్యం పేరుతో ఈరోజు విషాన్ని పేదలకు అమ్ముతున్నారని, విషమద్యం తాగి రాష్ట్రంలో 35 లక్షల మంది లివర్లు పాడైపోయాయి చనిపోయారని, రాష్ట్రం నుండి 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారని ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ తెలియదని , రాష్ట్రంలో మాఫియా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తోందని విమర్శలు చేశారు. జే బ్రాండ్ ఎందుకు పెట్టారో రాష్ట్రంలో అధికారంలో అంటూ సొంత బ్రాండ్లు పెట్టుకొని ఎవరైనా అమ్మకాలు చేస్తారా అని ప్రశ్నించారు, మద్యం షాపులో డబ్బులు తప్ప డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో తొమ్మిది సార్లు కరెంట్ బిల్లును పెంచి, చెత్త పన్ను పెట్టిన చెత్త.. గా మిగిలారని, 60 నెలలు పాటు అనుక్షణం దోచుకున్నారని జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని దెబ్బకు దిమ్మతిరిగి పోవాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో ఇసుకమాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్య మేలుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమి ఏర్పాటుచేసి రాష్ట్ర బాగుకోసం పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక కూటమి ఏర్పడిందని, ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని అన్నారు.
Social Plugin