
జంగారెడ్డిగూడెం -ప్రతినిధి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 26వ వార్డులో గడప గడపకు ఎన్నికలప్రచారం శనివారం చిటికెల అచ్యుత రామయ్య ఆధ్వరయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు.
గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టో వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని, అబద్ధపు మాటలు నమ్మొద్దని, ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో నవరత్న పథకాలను అమలు చేశారని, ఇచ్చిన మాట కట్టుబడి పథకాలని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులు ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంభం విజయరాజుకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రెటరీ బివిఆర్ చౌదరి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఏలూరు జిల్లా పార్టీ కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, వైసిపి సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మండవల్లి సోంబాబు, బత్తిన చిన్న, కౌన్సిలర్లు దొంతు మాధవ్ ఎల్విఆర్ ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, సంకు సురేష్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, ఏలూరు జిల్లా జే సి ఎస్ కన్వీనర్ చింతా అనిల్ కుమార్ గౌడ్, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యవర్గ సభ్యులు గెద్దాడ శ్రీనివాస్, గోకుల పారిజాత గిరి చైర్మన్ గుడపాటి రాధాకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ చిప్పాడ వెంకన్న, బూత్ కన్వీనర్ కే ఎస్ ప్రకాష్, ఏరియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చైర్మన్ మహమ్మద్ ఆఫీజ్, బూత్ ఇంచార్జ్ కాసర్ శేషారెడ్డి, తల్లాడ శ్రీనివాస్, తాడేపల్లి ఉమాదేవి, జీడిగంటి రామారావు, వీరవల్లి సోమేశ్వరరావు, పెసరగంటి త్రిమూర్తులు, తల్లాడ సంజయ్, చిట్లూరి సర్వేశ్వరరావు, మాచవరపు నాగేంద్ర, మల్లవరపు నాగపొసు, చలపతి నాగు, కళ్యాణ్ వర్మ హాజరయ్యారు.
Social Plugin