Ticker

6/recent/ticker-posts

చంద్రబాబు ఎన్నికల హామీలు నీటి మూటలేనా.. సాధ్యసాధ్యాలపై ఆర్ధిక నిపుణుల లెక్కలు


ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు రాజకీయ పార్టీలు వాగ్ధానాలు చేస్తాయి. ప్రజా సమస్యలు తీరుస్తామని హామీలు ఇస్తాయి. సంక్షేమ పాలనతో పాటు పలు ప్రజ ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెట్టి తద్వారా మేలు చేస్తామని మాటిస్తాయి. ఈ తరహా వాగ్ధానాలకు ఎన్నికల హమీలు అంటారు. ఏవైతే ప్రజలకు అందజేస్తామని మాటిస్తాయో వాటిని తమ ఎన్నికల మానిఫెస్టోగా ఎలక్షన్స్ సమయంలో ప్రకటిస్తాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 


అయితే అక్కడి ప్రజలకు రాజకీయ పార్టీలు తమకు తోచిన విధంగా..అమలుకు సాధ్యమయ్యే విధంగా హామీలు ఇస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ(TDP)..ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ(BJP)తో పొత్తుపెట్టుకొని కూటమిగా పోటీ చేస్తూ ప్రజలకు అలివిగాని హామీలను ప్రకటిస్తోందని వైసీపీ శ్రేణులు, రాజకీయ, ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తన ప్రతీ ఎన్నికల ప్రచార సభలు, వేదికలపై ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హామీల పేరుతో ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారనే వాదనలు అటు రాజకీయ వర్గాల్లో..ఇటు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం, ప్రభుత్వ రాబడి కంటే రెట్టింపు స్థాయిలో ప్రజలకు గ్యారెంటీల రూపంలో డబ్బు ఖర్చు చేస్తామని చెప్పడం చూసి ఆర్ధికవేత్తలు సైతం నోరు వెళ్లబెడుతున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు చెప్పుకుంటే బీసీ మహిళలకు పెన్షన్ 50ఏళ్లకేఇస్తామని చెప్పారంటే రాష్ట్రంలో సుమారు 32-33లక్షల మందికి ఫించన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి నెలకు 4వేల రూపాయల చోప్పున 32లక్షల మందికి లెక్కేస్తే నెలకు 1400 కోట్లు కావాలి. వీటితో పాటు యువతకు నిరుద్యోగభృతి, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ లు, వాలంటీర్ల జీతాలు లెక్క చూస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన మాటలు నీటి మూటలే అంటున్నారు వైసీపీ శ్రేణులు, ఆర్ధిక నిపుణులు.