Ticker

6/recent/ticker-posts

జనసంద్రంగా పాలకొండ!




జనసంద్రంగా పాలకొండ!
◆అలరించిన జననేత పవన్ పంచ్ఛ్లు
◆కొత్తపల్లి గీతను గెలిపిచాలని పిలుపు -
◆పవన్ కళ్యాణ్


శ్రీకాకుళం: పాలకొండ-ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పాలకొండ జనసముద్రంగా మారింది.పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పలుచోట్ల వారాహి విజయ యాత్ర నిర్వహించదలిచారు. అందులో భాగంగా పాలకొండలో నిర్వహించిన కూటమి సభ అత్యంత భారీగా విజయవంతమైంది. ఏపీలో వైసీపీ అరాచకానికి చెక్ పెట్టాలని, కూటమి గెలుపుతోనే ఈ రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి కనిపిస్తుందని పవన్ అక్కడి వారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగులతో కూటమి నేతలు, అభ్యర్థుల్లో హుషారు కనిపించింది.

అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పవన్ కోరగా అక్కడి గిరిజనులు జై పవన్, జైజై గీతమ్మ అంటూ నినాదాలు చేశారు. కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసి నిధుల వరద కురిపిస్తారని తెలిపారు. అనంతరం గీత మాట్లాడుతూ ఈ ఐదేళ్లు ఏపీ రావణ కాష్టంగా మారిందని, అప్పుల కుప్పలా మారిందని, రాష్ట్రంలో సంపద సృష్టించ లేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కూటమి అభ్యర్థులు కూడా మాట్లాడారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కూటమి అభ్యర్థులు తరఫున పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం దద్దరిల్లిపోయింది.

పాలకొండలో నిర్వహించిన బహిరంగ సభ జన సముద్రాన్ని తలపించింది. భారీగా హాజరైన యువత పవన్ కళ్యాణ్ మాటలు వినేందుకు ఎగబడ్డారు ముఖ్యంగా ఏడు నియోజకవర్గాల్లో గిరిజన యువత భారీగా హాజరయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూటమిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అరకు పార్లమెంటరీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న జనసేన బిజెపి టిడిపి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. గిరిజన యువత కడుపు మంట నాకు బాగా తెలుసని ఈ ప్రభుత్వంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర యాసను ఎన్నటికీ మర్చిపోనని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో ఎంతో ప్రాముఖ్యత చెందిన అనేక గిరిజన జానపద పాటలు పాడి సభకు వచ్చిన వారిని ఉర్రూతలూగించారు. శ్రీ శ్రీ వంటి ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డని వారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని అన్నారు. కలలు నిజం చేయడానికి జగన్ సిద్ధమని ప్రచారం చేసుకుంటున్నారని యువతకు ఎటువంటి ఉపాధి కల్పించారు, ఉద్యోగాలు కల్పించారు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. యువతకు మెగా డీఎస్సీ నిర్వహించారని ప్రశ్నించారు. ఈ గిరిజన ప్రాంతాలకు జగన్ కానీ వారి ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్యే ఎంపీలు గాని ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు పరిష్కరించారా అని ప్రశ్నించారు.

జగన్ దేనికి సిద్ధమని ప్రశ్నించారు 30,000 మంది ఆడపిల్లలు అదృష్టం అయిపోతే వారి గురించి పట్టించుకున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన కోసం అనేక పథకం అమలు చేస్తుందని వాటి గురించి తెలుసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఇక్కడ గిరిజనులకు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాను గిరిజన యువతకు మాటిస్తున్నానని కొత్తపెళ్లి గీత సమక్షంలో ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో మాట ఇస్తున్నానని గిరిజనుల సమస్యలు పరిష్కరించి తీరుతామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో మూల బండ నీటి ప్రాజెక్టులను పట్టించుకోని జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. తోటపల్లి రిజర్వాయర్ని కూడా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రైతుల సాగునీరుకి నిధులు లేవు కానీ వైసీపీ పార్టీ కార్యాలకు రంగులు మార్చుకోవడానికి వేల కోట్లు తగలబెట్టారని విమర్శించారు.

సాక్షాత్తు 2000 కోట్లు పైగా వైసిపి రంగుల కోసం తగలేసారని ఆగ్రహ వ్యక్తం చేశారు. జగన్ దోపిడీలు చూసి ఉత్తరాంధ్ర యువతరం తిరగబడిందని వచ్చే ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పాలని జగన్ ఇది గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. బిజెపి పార్టీ ఇన్సూరెన్స్ నుంచి అనేక పథకాలు మహిళ కూడా అమలు చేస్తుందని పేద ప్రజలకు అండగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు గిరిజనం కోసం పవన్ కళ్యాణ్ రాక పవన్ కళ్యాణ్ వల్ల గిరిజన ప్రాంతాలకు ఎంత మేలు జరుగుతుందని అరకు పార్లమెంటు బిజెపి కోటమే అభ్యర్థి కొత్తపల్లి గీత పేర్కొన్నారు. గిరిజనులు గిరిజనుల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారని అన్నారు గిరిజలంతా పిడికిలి బిగించి సైకో జగన్ ను ఇంటికి పంపించాలో జైలుకు పంపించాలో రానున్న ఎలక్షన్ లో మీరే తేల్చాలని అన్నారు. అరకు పార్లమెంటరీ పరిధిలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల్ని తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొత్తపెళ్లి గీత కోరారు.