Eluru;-జంగారెడ్డిగూడెం-ప్రతినిధి:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోనిజల్లేరు వాగు వద్దవిషాదం చోటు చేసుకుంది. వాగులో ప్రమాదవశాత్తుమునిగి ముగ్గురు మరణించిన ఘటన వారి కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెం గ్రామానికి చెందిన మౌలాలి జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో చేపల వేట సాగిస్తుంటాడు.తెలంగాణా లోనిఅశ్వారావుపేట మండలం వూట్ల పల్లి గ్రామానికి చెందిన షేక్ రేష్మ, అతని సోదరుడు షేక్ హసద్‌లు జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంలో ఉంటున్న బంధువు అయిన మౌలాలి ఇంటికి వచ్చారు.
మౌలాలితో పాటు అతని భార్య మొహిషాద్ (23), రేష్మ (24), హసద్ (14)లతో మరో వ్యక్తి మొత్తం 5గురు జల్లేరు ప్రాంతానికి వచ్చారు. మౌలాలీ చేపల వేట కోసం వల తేవడానికి వెళ్లిన సమయంలో మొహిషాద్, రేష్మ, హసద్‌లు జల్లేరు వాగులోకి దిగినట్లు స్థానికులు తెలిపారు. నీరు ఎక్కువగాఉండటంతో ఒక్క సారిగా ఈ ముగ్గురు వాగులో మునిగిపోయి గల్లంతయ్యారు. స్నానానికి దిగిన సమయంలో ఈ ముగ్గురు మునిగి పోయారంటూ స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు స్థానికులు, జాలరుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు మృత దేహాలను ఒడ్డుకు చేర్చారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ యు.రవిచంద్ర, సీఐ పి రాజేష్, ఎస్సై జ్యోతిబాస్‌లు ప్రమాద ఘటన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు కొనసాగించారు.మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించారు. తదుపరిమృత దేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో ఆకుటుంబాలవారు శోకసంద్రంలో మునిగిపోయారు.
Social Plugin