Ticker

6/recent/ticker-posts

అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో మహిళా బౌన్సర్లు


Vijayanagaram : అరకు  ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో  మహిళా బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఎంపీ అభ్యర్థికి మహిళా సెక్యూరిటీగా జనం తాకిడితో గీతకు రక్షణ కల్పించారు. అరకుబీజేపీఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లిగీతకు అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజనం ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండడంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. 

గిరిజన గ్రామాల్లో సెలబ్రెటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండడంతో ఇది కూడా ఒకింత ఆసక్తి గా ప్రజలకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే బౌన్సర్లగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత నూతన పంథాలో మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకింత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను మేము ఇందులోనూ పురుషులకు తక్కువ కాదనే రీతిలో  పెట్టుకోవడంపై సర్వత్రా హర్షిస్తున్నారు. బ్లాక్ టీ షర్ట్,ప్యాంట్ ధరించిన మహిళలు పురుష బౌన్సర్ల కు తీసిపోని విధంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు.

తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిచని ఈ లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు.వారివివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు.ప్రచారంలో ఇదీ ఓ విశేషంగా మారింది.రాబోయే కాలంలో  ఇదో ట్రెండ్ గా మారొచ్చు..