ఏలూరు జిల్లా, చింతలపూడి ప్రతినిధి: చింతలపూడి అసెంబ్లీ వైఎస్సార్ సి పి అభ్యర్థి కంభం విజయరాజు శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉదయం 7.30కి లింగపాలెం మండలంలోని వలసపల్లి అడ్డరోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా తరలి వచ్చి చింతలపూడి తాసిల్దార్ కార్యాలయానికి 11 గంటలకు చేరుకోవాలని, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసారు. నామినేషన్ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే...
అభ్యర్థి విజయరాజు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం రెండుకళ్ళని రెండు జరగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవాలని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి వైసిపి పాలనలో పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు చేస్తున్నట్లు వివరించారు. మళ్ళీ వైసిపి అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమన్నారు. జెండాలు కలుపుకుని అజెండాలు మార్చుకుని వైసిపి నే ఆదర్శంగా తీసుకుని ఎన్నికల బరిలోకి ఒకటిగా వస్తున్న విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చెయ్యాలని విజయరాజు పిలుపునిచ్చారు. సింహం సింగిల్ గానే వస్తుందని, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటరి గానే ప్రజా బలంతో సంక్షేమ రాజ్య స్థాపనకై మన ముందుకు వచ్చారని తెలిపారు. చింతలపూడిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Social Plugin