Ticker

6/recent/ticker-posts

సీతారామస్వామి ఆలయంలో ముగిసిన బ్రహమ్మో త్సవాలు


◆భక్తులకు అన్న సమరాధన
◆భారీ స్థాయిలో స్వామివారి వూరేగింపు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: పట్టణంలో వేంచేసియున్న శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో ఈ నెల16వ తేదీన ప్రారంభమయిన బ్రహ్మోత్సవములలో భాగంగా శుక్రవారం మహా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వాణ అధికారి ఆకుల కొండల రావు స్వీయ పర్యవేక్షణలో అన్నసమారాదన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారు. అన్నసమారాధన అనంతరం సాయత్రo 5.00 గంటల నుండి ప్రత్యేక వాహనంపై శ్రీ స్వామి వార్లను అమ్మవార్లను ఆసీనులు చేసి కేరళ నృత్యం, ఇతర నృత్య కార్యక్రమాలతో వివిధ మేలా తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. 

పట్టణం ప్రధాన వీధుల్లో సీతారాముల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఇళ్ళలోనుండి బయటకు వచ్చి మహిళలు స్వామిని, అమ్మవారి ని దర్శనం చేసుకున్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించిన బ్రహ్స్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్య పూజాదికాలు కైంకర్యంతో స్వామికి అన్ని సేవలు అందించారు. మహిళా భక్తులు పోటెత్తారు. శ్రీరామ స్వామి కలిసి వచ్చిందని తెలిపారు. ఆలయం వద్ద ధ్వజ స్తంభం ఏర్పాటుకు భక్తులు సిద్ధంకాగా సీతారామ స్వామి ఆలయ ధ్వజ స్తంభం కోసం కొందరు భక్తులు ముందుకు వచ్చారు. 

గతంలో ఉన్న ధ్వజ స్తంభం బులిగి పోవటంతో ముక్కలుగా విరిగింది. దాని స్తానంలో నూతన ధ్వజ స్తంభాన్ని నెలకొల్పేందుకు భక్తులు సన్నద్ధం అవుతున్నారు. ఆలయానికి నూతన కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో ధ్వజ స్తంభం గురించి భక్తులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఆలయ కార్యక్రమాలలో కమిటీ పాత్ర లేకుండా ఈ ఓ నేతృత్వంలోనే జరుగుతున్న ట్టుతెలిపారు. ఎన్నికల తంతు ముగిశాక ధ్వజ సంభం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.