Ticker

6/recent/ticker-posts

పోలవరంలో గెలుపు జనసేనదే.. : డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు


◆వార్డు స్థాయి ప్రచారానికి సంసిద్దులు కావాలి

◆నియోజకవర్గ సమావేశంలో పిలుపు

◆డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు ధీమా


బుట్టాయి గూడెం-ప్రతినిధి: పోలవరంలో గెలిచేది కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు అని సీనియర్ నాయకుడు డి సి సి బి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అభ్యర్థి బాలరాజు గెలుస్తారని మెజారిటీ మీదే దృష్టి పెట్టాలని ఆయన నాయకులకు కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం బుట్టాయి గూడెంలోని జనసేన జిల్లాప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్ర మోహన్ ఇంటి వద్ద పోలవరం నియోజకవర్గ మండల కమిటీ అధ్యక్షులు గ్రామ కమిటీ నాయకులు ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. 

ప్రచారాన్ని నమ్మొద్దు కష్టపడి అభ్యర్థిని గెలిపించాలని కరాటం పిలుపునిచ్చారు. వార్డు స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని గ్లాసు గుర్తు సామాన్యులకి చేరే రీతిలో ప్రచారం ఉండాలని సూచించారు. బిజెపి, తెదేపా శ్రేణులును కలుపుకుని గ్రామాల్లో పర్యటించాలని ఇంటింటికీ వెళ్లాలని కోరారు. పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు విసిగిపోయినట్టు తెలిపారు. కూటమి అభ్యర్థులను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

గొట్టుముక్కల తదితరులు జనసేనలో..చేరిక..

వైసిపి ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, జనసేనలో చేరిన సీనియర్ నాయకుడు గొట్టుముక్కల భాస్కరరావు చెప్పారు. ప్రజల్లో చాలా అసమ్మతి ఉందని ఆపార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉదని సరైన సమయంలో అంతా బయట పడుతుందని తెలిపారు. భాస్కరరావు తోపాటు పలువురు కార్యకర్తలు జనసేనలో చేరగా కరాటం రాంబాబు కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, కరాటం రెడ్డి బాబు ప్రభృదులు పాల్గొన్నారు.