Ticker

6/recent/ticker-posts

చట్టప్రకారం దత్తత తీసుకోవటాని తల్లిదండ్రులుముందుకు రావాలి


ఏలూరు: పిల్లలు లేని దంపతులు ఎవరైనా సరే ఆన్లైన్ లో CARA పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో శిశుగృహలోని 8 నెలల చిన్నారిని "కార"  నియమ నిబందనల ప్రకారం 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న బెంగళూరుకు చెందిన తల్లిదండ్రులుకి అన్ని సర్టిఫికెట్ లు సరి చూసిన తరువాత, ఆర్ధికంగాను, ఆరోగ్యం పరంగానూ అన్ని బాగున్నాయి అని నిర్ధారించిన పిమ్మట, జిల్లా దత్తత అధికారి అయిన జిల్లా మెజిస్ట్రేట్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా వారికి అప్పగించడం జరిగింది. 


చట్ట ప్రకారం దత్తత తీసుకోవటాని ప్రోత్సహిస్తు పిల్లలు లేని దంపతులు ఎవరైనా సరే ఆన్లైన్ లో CARA పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పిల్లల కొరకు కుటుంబాలు తల్లిదండ్రులు ముందుకు రావాలి కానీ తల్లిదండ్రులు కొరకు పిల్లలు కాదన్నారు. అదేవిధంగా పిల్లలు లేని దంపతులకు దత్తత మంచి మార్గమని కలెక్టర్ చెప్పారు. 

పిల్లలు ను కోరుకునే తల్లిదండ్రులు చిన్న పిల్లలునే కాకుండా పెద్ద వాళ్ళని కూడా తీసుకోవటానికి ముందుకు రావాలి. ఈ కార్యక్రమంలో పీడీ ICDS  కె ఏ వి ఎల్. పద్మావతి, డి సి పి ఓ. డాక్టర్ సిహెచ్. సూర్య చక్ర వేణి, శిశుగృహ మేనేజర్, భార్గవి పాల్గొన్నారు.