ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం SR TV న్యూస్: తెలుగు వారి పండుగ ఉగాది అని దీన్ని హిందు పండుగగా భావించ కూడదని ప్రముఖ విద్యా వేత్త, స్థానిక ప్రియదర్శిని కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డా.అలుగు ఆనంద శేఖర్ అన్నారు.
ఇక్కడి ప్రియదర్శిని కాలేజీలో మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా ఏపీడబ్ల్యూ జె ఎఫ్ లో జిల్లా పదవులు పొందిన పాత్రికేయులకు అభినందన కార్యక్రమంజరిగింది. మీడియా హౌస్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వవహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనంద శేఖర్ ఎపి డబ్ల్యూ జెఎఫ్ పాత్రికేయుల సంక్షేమానికి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఈ విధంగా అందరూ సంఘటితంగా ఉండాలని సామాజిక మార్పుకోసం కృషి చేయాలని సూచించారు.
అలాగే మరో అతిధి ఏపీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకరరావు మాట్లాడుతూ యూనియన్ పురోభివృద్ధి కి కృషి చేసే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడం ద్వారా మరింతగా వారి సేవలను వినియోగించు కునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన కొత్తూరి రవి కిరణ్, సహాయ కార్యదర్శి కలపాల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కడిమి రాజేష్, డి.లోకేష్ లను, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ కడలి గాంధీని యూనియన్ నాయకులు, ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
వారధి ట్రస్ట్ అధినేత తాతాజీ కి అభినందన సత్కారం..
ఈ కార్యక్రమంలోనే వారధి ట్రస్ట్ అధినేత, మున్సిపల్ కౌన్సిలర్ వల వల తాతాజీ అందిస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఆయన్ను ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ తరఫున దుస్సాలువతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షుడు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పాల్గొని సన్మాగ్రహితలను అభినందించారు. పదవులు పొందిన వారు వాటికి న్యాయం చెయ్యాలని హితవుపలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మీడియా హౌస్ కార్యదర్శి పి ఎన్ వి రామా రావు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పరసా రాంబాబు, గుర్రాల వెంకటేశ్వరరావు, అమృతల రంగారావు, ఎం కిషోర్ కుమార్, గరువు బాబూ రావు, పామర్తి నాగరాజు, బండి ప్రసాద్, ఉప్పల కృష్ణ, అలుగు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin