ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, SR న్యూస్: స్థానిక తెదేపా ఎన్నికల క్యాంప్ కార్యాలయంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పంచాంగ శ్రవణం నిర్వహించారు.
తెదేపా, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పండితులు, పురోహితులు పంచాంగ శ్రవణంలో ఆకాంక్షించాని రోషన్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా తొలుత అభ్యర్థి రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ ప్రజలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రస్తుత వైసిపి రాక్షస పాలనకు చరమగీతం పాడి, రాష్ట్రం సుభీక్షంగా ఉండాలి అని కోరుతున్నామన్నారు.
అదే విధంగా 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని పండితులు తెలియజేసారన్నారు. మరలా వచ్చే ఉగాది పర్వదినం రాముడు లాంటి చంద్రన్న పాలనలో జరుపుకుంటామని అన్నారు.
Social Plugin