Ticker

6/recent/ticker-posts

డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వితరణతో వారధి ట్రస్ట్ నుండి కళ్ళజోళ్ళు పంపిణీ



ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం ప్రతినిధి: పట్టణం నాల్గవ వార్డ్ ఇందిరా నగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో బుధవారం ఉదయం వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ నేతృత్వంలోని ట్రస్ట్ ప్రతినిధులు స్థానిక సుశీలా హాస్పిటల్ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు ద్వారా రూ. 25,000 వ్యక్తిగత వితరణతో 100 మంది లభ్డిదారులకు కళ్ళజోళ్ళు అందజేసే కార్యక్రమం జరిగింది.
     
వలవల తాతాజీ మాట్లాడుతూ తమ చిన్ననాటి మిత్రులు కాకర్ల రామచంద్రబాబు ప్రతీ సంవత్సరం ఇందిరా నగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్యసన్నిధిలో ఫిబ్రవరి 9న నిర్వహించే స్వామి వారి వార్షికోత్సవంలో చేపట్టే ఉచిత నేత్ర వైద్య శిబిరంలో నిపుణులు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఉచితంగా 
కళ్ళజోళ్ళు అందిస్తూ అండగా నిలుస్తున్న క్రమంలో ఈయేడు గౌతమి నేత్రాలయ, రాజమండ్రి వారి ద్వారా ఎంపిక చేసిన 100 మందికి రూ. 25,000 విలువైన కళ్ళజోళ్ళు అందించారు. 

కాకర్ల రామచంద్రబాబు స్నేహానికి ఇచ్చే విలువను తాతాజీ గుర్తుచేస్తూ తమ చిన్ననాటి మిత్రుల్లో మృతులైన మిత్రుల ఇద్దరు ఆడబిడ్డలకు పూర్తి ఉచితంగా విద్యకు తోడ్పాటును అందిస్తూ తమ వంతు ఆదుకుంటున్నారని కాకర్ల రామచంద్రబాబు దాతృత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
   
బసవరాజు వేణు మాట్లాడుతూ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వారధి ట్రస్ట్ సేవల్లో నేత్ర వైద్య లబ్ధిదారులకు 7 సంవత్సరాలుగా సహకరిస్తున్నారని తెలిపారు.

పెదవేగి రాంబాబు మాట్లాడుతూ సేవకు హృదయం ప్రధానమని వలవల తాతాజీ అడుగులువేస్తే, స్నేహాన్ని సమాజసేవకు మళ్లించి కాకర్ల రామచంద్రబాబు ఎల్లప్పుడూ మిత్రులకు తోడుగా నిలుస్తున్నారని అన్నారు.
  
అనంతరం లబ్ధిదారులకు కళ్ళజోళ్ళు వారధి ట్రస్ట్ ప్రతినిధులు పంపిణీ చేశారు. కాకర్ల రామచంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కే ఎల్ ఎన్ ధనకుమార్ మరియు ట్రస్ట్ ప్రతినిధులు కలపాల శ్రీనివాసరావు, మద్దిపాటి శ్రీను, కోట కృష్ణంరాజు, వసంతాటి మంగరాజు, కొత్తపల్లి శివ, కంబాల పండు, బోయిన సత్యనారాయణ, గంటా నాగార్జున తదితరులు పాల్గొన్నారు.