Ticker

6/recent/ticker-posts

ఉమ్మడి ప్రభుత్వంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం.: తెదేపా కూటమి అభ్యర్థి రోషన్


జంగారెడ్డిగూడెంలో విస్తృతంగా ప్రచారం..

కార్పెంటరీ, తాపీ వర్కర్స్. ఆటో యూనియన్ నేతలతో భేటీ


జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: కార్మికులు, కర్షకుల కష్టాలు ఇబ్బందులు అన్నింటికీ పరిష్కారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారం లోకి తేవడమేనని చింతలపూడి అసెంబ్లీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టౌన్, రూరల్ గ్రామాల్లో కూటమి నాయకులుతో సమీష్టి ప్రచారం చేశారు.

తాపీ వర్కర్స్, కార్పెంటరీ, సీనియర్ సిటీజెన్స్ ప్రభృదులను రోషన్ స్వయగా కలసి తమ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పట్టణాభివృద్ధికి వివిధ వర్గాల పురోభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా రోషన్ కుమార్ తెలిపారు. ఇక్కడి శ్రీనివాస్ ధియేటర్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద యూనియన్ నాయకులతో రోషన్ కుమార్ మమేకం అయ్యారు.

ఖాకీ షర్ట్ వేసుకుని ఆటో డ్రైవర్ గా మారారు. ఈ సందర్భంగా..ఆ స్టాండ్ పరిధిలోని ములగలంపల్లి, మైసన్నగూడెం, శ్రీనివాసపురం, అక్కమపేట, పట్టేన్నపాలెం, రెడ్డిగణపవరం ఆపై మార్గాలలో ఆటోలు నడిపేవారు తమ ఈతి బాధలు ఏకరువు పెట్టారు. ముఖ్యంగా రోడ్లు బాగా దెబ్బ తిన్నాయని, ములగలంపల్లి రోడ్డు ఆరు మసాలా క్రితం మొదలుపెట్టారని మధ్యలో వదిలేసారని వాపోయారు. 

అంతకు ముందు తెదేపా అధికార ప్రతినిధి దాసరి శేషు నేతృత్వంలో కార్యకర్తలు రోడ్ల మీద పడ్డ భారీ గోతుల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపినట్టు పేర్కొన్నారు. శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే ఎలీజాను అపి కూడా పరిస్థితి తెలీజేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల మొదలు పెట్టిన రోడ్డు పని మధ్యలోనే కాంట్రాక్టర్ వదిలేశారని రోడ్లు దారుణంగా ఉన్నాయని, పట్టేన్నపాలెం వద్ద జల్లేరు వంతెనను కూడా అసంపూర్తిగా వదిలేశారని వివరించారు.