Ticker

6/recent/ticker-posts

ప్రస్తుత ఎమ్మెల్యే సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు


బుట్టాయిగూడెం-ప్రతినిధి: గ్రామ వార్డు సచివాలయాల
వాలంటీర్లు రాజకీయ కార్యకలాపాలను సాగిస్తున్నారని ఆరోపణలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తమకు అనుకూలంగా మార్చు కోడానికి అధికారం కోసం వారిని కొనసాగిస్తామని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఏలూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి విమర్శించారు.

బుధవారం పోలవరం అభ్యర్థినిగా రాజ్యలక్ష్మి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ యాదవ్ చంద్రబాబు, పవన్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురంలో ఓటమి ఖాయమని ఆ భయంతో పవన్ అర్థం లేని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. 175 సీట్లు సాధించి వైఎస్సార్ కంగ్రేస్ విజయ దుందుభి మోగించడం ఖ్యాయం అని జోస్యం చెప్పారు.


అట్టహాసంగా తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్..

పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి బుధవారం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి సూర్యతేజ తెలిపారు. వైకాపా నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా చిర్రి బాలరాజు తరఫున ఆ పార్టీ శ్రేణులు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తెదేపా మద్దతుదారు కొవ్వాసి జగదీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. వీరు కె.ఆర్.పురం ఐటిడిఎ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సూర్యతేజకు తమ నామినేషన్ పత్రాలను అందించారు.