Ticker

6/recent/ticker-posts

మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సతీసమేతంగా స్వామిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే.. బాలరాజు


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం ప్రతినిధి: మండలం గుర్వాయిగూడెం లోగల స్వయం భూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు రద్దీ పెరిగింది. తెల్ల వారుఝాము 4 గంటల నుంచి భక్తులు దైవ దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు విచ్చేశారు. క్యూ లైన్లు కిక్కిరిసి కనిపించారు. మొక్కులు ముడుపులు చెల్లించు కొనేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అన్నప్రాసన, ముడుపులు చెల్లింపు, తలనీలాలు సమర్పణ108 ప్రదక్షిణలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు విద్యార్థులు అధికసంఖ్యలో విచ్చేసారు. వేసవికాలం దృష్ట్యా భక్తుల కోసం చల్లని మజ్జిగ, ప్రసాదం అందించారు. అలాగే అందరికీ ఆలయంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్టు ఈ ఓ ఆకుల కొండలరావు తెలిపారు.

పోలవరం ఎం.ఎల్ ఏ..బాలరాజు పోలవరం అభ్యర్థి, ఆయన సతీమణి స్వామి చెంతకు రాక..

పోలవరం శాసన సభ్యుడు, తెల్లం బాలరాజు స్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామిని పోలవరంలో విజయం చేకూర్చాలని బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి వేడుకున్నారు. ఎన్నికలకోడ్ నేపథ్యంలో ప్రోటోకాల్ తో పని లేకుండా సాధారణ భక్తుల మాదిరిగానే ఎమ్మెల్యే దైవ దర్శనం చేసుకున్నారు.. వారితోపాటు వైసిపి నేతలు మేడవరపు సాగర్ బాబు, బివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.