Ticker

6/recent/ticker-posts

పారిజాత గిరిలోనిత్యాన్నదానానికి రూ 60,116 /- విరాళం


ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరిపై గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామనవమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 6 00 గంటలకు ఆరాధన భాలబోగ నివేదన తీర్ధ ప్రసాదగోష్ఠి అనంతరం స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
 
ఉదయం బలుసు పూర్ణిమ అనే స్వామి భక్తురాలు, రవితేజ అనే యువకుడు తనకి ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం స్వామివారికి సమర్పిస్థానని మొక్కు కుని మొక్కుబడి చెల్లించుకున్నట్టు ఈ ఓ మానికల రాంబాబు తెలిపారు. ఉద్యోగం రావడంతో స్వామివారికి మొక్కుబడిగా రూ. 60, 116/- నిత్య అన్నదానంకి విరాళముగా ఇచ్ఛినట్టు తెలిపారు. 

శ్రీరామ నవమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించికున్నారని, ప్రసాదావితరణ ఉభయదారులుగా అభివృద్ధి కమిటీ సభ్యుడు కంది బాలకృష్ణరెడ్డి, సీతామహాలక్ష్మీ పానకం, వడపప్పు, కట్టుపొంగలి ప్రసాదాలు శ్రీస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు అందజేశారని ఈ ఓ మానికల రాంబాబు తెలిపారు.