ఏలూరు, జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: పట్టణంలోని మూడో వార్డు, ఐదవ వార్డులో ప్రచారాన్ని వైసిపి చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి పోలవరం పరిశీలకులు జట్టి గురునాధరావు ప్రారంభించారు.
సీనియర్ నేతలు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికన అచ్యుతరామయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి తులసి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మానవతమూర్తి, ముప్పిడి శ్రీనివాసరావు
పాల్గొన్నారు. అభ్యర్ధి.. విజయరాజు మాట్లాడుతూ పట్టణంలో రూ.14 కోట్ల తో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టి పట్టణాన్ని అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి విద్య ఆరోగ్యం వీటిపైనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారని పేర్కొన్నారు.
గురునాధరావు మాట్లాడుతూ ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాయకులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో పట్టణాన్ని వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అంటే మళ్ళీ వైసిపి అధికారంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటా ప్రచారంలో వార్డు ప్రజలు నేతలను సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా మజ్జిగ, కూల్ డ్రింకులు ఇతర పానీయాలు ఇచ్చి తమ అభిమానాన్ని చూపారు. ఈనేపథ్యంలో నేతలు ఉత్సాహంగా ప్రచారం చేశారు.
Social Plugin