చింతలపూడి, ప్రతినిధి: మండలం ప్రగడవరం పంచాయతీ ఫాతిమాపురం గ్రామంలో రోడ్డు పక్కన చక్రాల బండిపై పండ్లు అమ్ముకుంటున్న చిట్లూరి సావిత్రి బండిపై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడి పండ్లు బండి ధ్వంసమైంది. ఈ విషయం తెలిసి చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించి మానత్వం చాటుకున్నారు. ఫాతిమాపురం సెంటర్లో ప్రమాదం జరిగిందని తెలిసినా .. స్థానికులు, స్ధానిక నాయకులు ఎవరు స్పందించలేదు. చెట్లూరి సావిత్రి అనే పళ్ళు అమ్ముకునే మహిళ జీవన యాత్రలో భాగంగా ఉపాధి కోసం తయారు చేసుకున్న చక్రాలు బండి విరిగిపోయి దానిపై ఉన్న పళ్లు మొత్తం పాడైపోయిన పరిస్థితి.
కానీ ప్రతి నాయకులు "నేనున్నాను" "నేను చూసుకుంటాను" "మీకు నేను అండగా ఉంటానని" అంటూ మాటలకే పరిమితమైతున్నారు. ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తున్న మార్గమధ్యంలో ప్రమాదం జరిగిందని గమనించి వెంటనే వెనుతిరిగి వచ్చి వారిని పరామర్శించి వారికి భరోసా కల్పించి రూ.10 వేలు ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్
అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత మహిళ సావిత్రి మాట్లాడుతూ ఫాతిమాపురం సెంటర్లో ఎంతోమంది నాయకులు ఉన్నారు. ప్రమాదం జరిగిందని చూసుకుంటా వెళ్లారు కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ "మీరే నేరుగా వచ్చి మా కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు" అని సొంగ రోషన్ కుమార్ కు తెలిపింది.
Social Plugin