Ticker

6/recent/ticker-posts

ముదినేపల్లిలో నవధాన్యాల విత్తన శుద్ధి కార్యక్రమం – ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన


ఏలూరు/ముదినేపల్లి, జూన్ 12: ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో 22 రకాల పీఎండీఎస్ (PMDS) నవధాన్యాల విత్తనాలకు బీజామృతంతో విత్తన శుద్ధి నిర్వహించి పొలాల్లో చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నవధాన్యాల సాగు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.


మండల ఇన్‌చార్జి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాలు, ఎన్ఎఫ్ఏ డి. మధుబాబు సూచనల మేరకు రైతులకు నవధాన్యాల సాగు, సీడ్ పెలెటైజేషన్ (విత్తన గుళికల తయారీ), ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. నవధాన్యాల సాగు, విత్తన గుళికల తయారీ వంటి పద్ధతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఉపయోగపడటమే కాకుండా భూసారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

అలాగే నవధాన్యాల సాగు ద్వారా నేలలో జీవవైవిధ్యం పెరిగి, సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి రైతు ఆచరించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయ వ్యవస్థను అందించవచ్చని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐసీఆర్పీలు, గ్రామ రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.