Ticker

6/recent/ticker-posts

జలధార-జలహారతి కార్యక్రమంలో రూ.250 కోట్లతో 2250 పనులకు పరిపాలన ఆమోదం


ఆంధ్రప్రదేశ్, ఏలూరు, మే, 14 :  జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమంలో 250 కోట్ల రూపాయలతో 2250 పనులను మంజూరు చేయడం జరిగిందని, నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జలధార-జలహారతి కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  


ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమంలో 250 కోట్ల రూపాయల విలువైన 2250 పనులకు  పరిపాలన ఆమోదం చేయడం జరిగిందన్నారు. వీటిని ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు. చేపట్టిన పనులు తప్పనిసరిగా పూర్తి నాణ్యతతో ఉండేలా పర్యవేక్షించాలన్నారు.  ఆమోదించిన పనుల వివరాలు, పనుల పురోగతి ని ఎప్పటికప్పుడు  ఆన్లైన్ యాప్ లో తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు.  

2250 పనులకు గాను కేవలం 1761 పనుల వివరాలు మాత్రమే ఆన్లైన్ లో నమోదు చేయడంపై ఎంపిడిఓ లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రేపటి సాయంత్రంలోగా మిగిలిన పనుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.   జలధార-జలహారతి కార్యక్రమం మంజూరై ఇంకా ప్రారంభం కానీ పనులను  వెంటనే ప్రారంభించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో 1530 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనులను కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు.  క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించి, పనులు చేపట్టకముందు, చేపట్టిన తరవాత ఫొటోలతో పాటు వివరాలను ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. 

డ్వామా పీడీ కె. సుబ్బారావు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్  శాఖల  ఎస్ఈ  లు దేవప్రకాష్, రమేష్, ఎంపిడిఓలు, డ్వామా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.