Ticker

6/recent/ticker-posts

ఇరాన్ యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన ట్రంప్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు..


WORLD NEWS: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్, అమెరికా మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు యుద్ధాన్ని ముగించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా దిగి వచ్చాయి. అంతకు ముందు, ఈ రోజు (సోమవారం) ఉదయం ముడి చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరి షాకిచ్చింది.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత ముడి చమురు ధర భారీగా దిగి వచ్చింది. బ్యారెల్‌కు ఏకంగా 13 శాతం తగ్గింది. 114 డాలర్ల నుంచి ఏకంగా 17 డాలర్లు తగ్గి 96 డాలర్లకు దిగి వచ్చింది. 'పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసే విషయమై ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నాం' అని ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా తెలిపారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు భయంతోనే వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రకటించింది (Oil market reaction). తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే హెచ్చరికలతోనే ఆయన వెనక్కి తగ్గారని ఇరాన్ అధికారిక టెలివిజన్ పేర్కొంది. అఫ్గానిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఇదే తరహాలో స్పందించింది.