Ticker

6/recent/ticker-posts

పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..


INDIA NEWS: గృహ వినియోగదారుల కోసం 10 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌‌తో సిలిండర్‌లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. అవన్నీ ఊహాగానాలేనని, అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరణ ఇచ్చారు. 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల వార్తను ఖండించారు.


పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు 10 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌‌తో సిలిండర్‌లను సరఫరా చేసే అంశాన్ని ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి (Petroleum Ministry clarification). ఆ వార్తలు అసత్యాలేనని తాజాగా కేంద్రం ఖండించింది. ఎల్పీజీ సిలిండర్ల బరువు తగ్గించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌లు సరఫరా అవుతున్న విషయం తెలిసిందే.