Ticker

6/recent/ticker-posts

మహిళా దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


బుట్టాయగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుట్టాయగూడెం జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం పరిశీలించారు.


రేపు జరగనున్న మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వేదిక, కూర్చోవడానికి ఏర్పాట్లు, మహిళల కోసం కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను ఆయన పరిశీలిస్తూ అధికారులు, నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళల ప్రతిభను వెలికితీసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, అధికారులు, కూటమి నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.