జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవికుమార్, దాకరపు నరసింహమూర్తి, కూటమి నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.



.jpeg)