Ticker

6/recent/ticker-posts

‎కొద్ది నెలల్లోనే కొల్లేరు భూములకు శాశ్వత పరిష్కారం - ఎంపీ పుట్టా మహేష్ కుమార్


‎.. కొల్లేరు రైతుల సమస్యపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.

‎.. సుప్రీంకోర్టులో త్వరలోనే సానుకూల తీర్పు వస్తుంది.
‎.. కొల్లేటికోట పెద్దింటమ్మ జాతరలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
‎ఏలూరు, మార్చి 01: కొల్లేరు భూముల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం వస్తుందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటికోటలో వెలసిఉన్న పెద్దింటమ్మవారి(జలదుర్గ అమ్మవారు)  జాతర మహోత్సవాల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. పెద్దింటమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆ అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొల్లేరు రైతుల, ప్రజల సమస్యలు తొందర్లోనే తొలగిపోవాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. 

పక్షులు, పర్యావరణంతో పాటు, లక్షలాదిమంది ప్రజల జీవితాలకు సంబంధించిన భూముల అంశం ముడిపడి ఉన్న ఈ సమస్యపై తాను చిత్తశుద్ధితో పోరాడుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల ప్రకారం తాను ఇటీవల ‎సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ (CEC) వారిని ఢిల్లీలో కలిశానని, వారు తయారు చేసిన నివేదికలో కొల్లేరు రైతుల సమస్యలు గుర్తించినట్లు చెప్పారని, వారి నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో త్వరలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. సమస్య పరిష్కారం అయిన తర్వాత పెద్దింటమ్మ దర్శనానికి మళ్ళీ వస్తానని చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. 

ఈ  సందర్భంగా టీడీపీ నేత బలే యేసురాజు మాట్లాడుతూ ఏలూరు ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా కొల్లేరు రైతులకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి అండగా నిలబడుతున్న యువ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఈప్రాంత ప్రజానీకం రుణపడి ఉంటుందన్నారు.
కొల్లేరు కైకలూరు -  కొల్లేరు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం వరాహపట్నంలోని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నివాసానికి వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం 128 వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న శ్రీ భూసమేత లక్ష్మీనరసింహస్వామి  ఆలయానికి ఎంపీను స్వయంగా తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చేయించి, పురోహితులతో ఆశీర్వచనం ఇప్పించారు ఎమ్మెల్యే కామినేని. అక్కడి నుంచి ఎమ్మెల్యే తో కలిసి మూలలంక పెద్దింటి అమ్మవారి గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా ఎంపీ కొల్లేటికోటకు బయలుదేరి వెళ్లారు. ఎంపీ పర్యటనలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, టీడీపీ నాయకులు బీకేఎం నాని, బలే యేసురాజు, జనసేన నేత కొల్లి వరప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు.