ఏలూరు, మార్చి, 10: ఏలూరు, కొత్తూరు జూట్ మిల్లులు అర్ధాంతరంగా మూసివేయబడిన నేపథ్యంలో కార్మికులకు ఈఎస్ఐ ద్వారా అందాల్సిన అన్-ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎఫ్‌టీయూ ప్రతినిధి బృందం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
అనంతరం ఎమ్మెల్యే గారి ద్వారా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని కూడా కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు సానుకూలంగా స్పందిస్తూ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఢిల్లీకి వెళుతున్నానని, డిసెంబర్ 3న ఢిల్లీలో ఈఎస్ఐ అధికారులతో మాట్లాడి కార్మికులకు అన్-ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై తన పీఏ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తానని తెలిపారు. అలాగే ఈ అంశాన్ని తన వ్యక్తిగత డైరీలో నమోదు చేసుకున్నారు.
వెంటనే స్పందించిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఐఎఫ్‌టీయూ తరఫున ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు అన్-ఎంప్లాయిమెంట్ బెనిఫిట్స్ త్వరలోనే అందుతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ బెనిఫిట్స్ రాకపోతే తగిన కార్యాచరణ చేపట్టేందుకు ఏలూరు, కొత్తూరు జూట్ మిల్లు కార్మికులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీని కలిసిన ప్రతినిధి బృందంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వి., రాష్ట్ర కమిటీ సభ్యులు బి. సోమయ్య, ఏలూరు జూట్ మిల్లు కార్యకర్తలు కోసూరి నూకరాజు, బగాది రమణ, కింతల చిట్టయ్య, బుడుమూరి శ్రీను, బుద్ధా నాగేశ్వరరావు, తెంటు సింహాచలం, త్రినాథ్, కొత్తూరు జూట్ మిల్లు కార్యకర్తలు ఆర్నేపల్లి దుర్గారావు, వి. వెంకట్రావు, బాలాజీ, కప్పా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)