Ticker

6/recent/ticker-posts

హెల్మెట్ లేకపోతే జరిమానా కాదు… ప్రాణ రక్షణే ముఖ్యం – చింతలపూడి ఎస్‌ఐ సతీష్ కుమార్


చింతలపూడి, మార్చి, 10: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చింతలపూడి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించడం కంటే, వారి ప్రాణ రక్షణ ముఖ్యమని చింతలపూడి ఎస్‌ఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు.


జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది కలిసి రహదారి భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించకుండా, అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు సూచించారు.

“వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకుని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను నివారించాలని ఎస్‌ఐ సతీష్ కుమార్ సూచించారు. “మీ ప్రయాణం సురక్షితం – మీ కుటుంబం పదిలం” అని ఆయన తెలిపారు.