Ticker

6/recent/ticker-posts

జనసేన పార్టీ సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం మన కుటుంబానికి రక్షణ కవచము - రెడ్డి అప్పల నాయుడు


ఏలూరు, మార్చి 10: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ఈరోజే చివరి అవకాశం అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 26న ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజుతో ముగుస్తుందని వెల్లడించారు.


ప్రతి జనసైనికుడు రూ.400 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, ఇది కేవలం సభ్యత్వం మాత్రమే కాకుండా కుటుంబానికి రక్షణ కవచమని ఆయన పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.

రాజకీయాల్లో ఉన్నతమైన భావాలతో జనసేన పార్టీని స్థాపించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏలూరులో 6 వేలకుపైగా సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు.

యువతతో పాటు ముఖ్యంగా మహిళలకు కూడా పార్టీ సభ్యత్వం కల్పిస్తున్నామని, ఉద్యమాలతో పాటు కార్యకర్తల కుటుంబాలకు కూడా జనసేన పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

ఏలూరులోని 50 డివిజన్లలో ఉద్యమీలను సంప్రదించి సభ్యత్వం నమోదు చేసుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఆపద సమయంలో కుటుంబానికి భరోసాగా నిలిచే కార్యక్రమమే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమమని, వెంటనే సభ్యత్వం పొందాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు.