కడియం, మార్చి 12: తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం గురువారం విజయవంతంగా జరిగింది. మండల కేంద్రం కడియం జీ ఎన్.ఆర్ కళ్యాణమండపంలో ప్రముఖుల మధ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కాల సూరిబాబు, ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కార్యదర్శిగా అన్నందేవుల సూర్యచంద్రరావు, ట్రెజరర్ గా కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, సలహాదారునిగా పల్ల గిరి కార్యవర్గ సభ్యులుగా దూడల అర్జున్, శెట్టి పోసిబాబు, వేపకాయల వీరభద్రరావు, ఎడ్ల నరేష్, అడ్డగళ్ళ దుర్గా ప్రకాష్, అడ్డగళ్ళ రాము, నేల రాజేష్, అబ్బూరి రామకృష్ణ, చెల్లుబోయిన శ్రీనివాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
జీ ఎస్ ఆర్ ఫౌండేషన్ ట్రస్టీ, టీడీపీ రాష్ట్ర నాయకులు గోరంట్ల రవి కిరణ్ కడియం ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తామని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
తొలుత వైసిపి రూరల్ కోఆర్డినేటర్, పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కడియం ప్రెస్ క్లబ్ ప్రమాణస్వీకారానికి విచ్చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం నాని చే నూతన కార్యవర్గాన్ని వేదమంత్రాలతో ఆశీర్వదించగా, ఆ సంఘ అధ్యక్షులు పున్నమిరాజు వీర్రాజు దుస్సాలువతో అందర్నీ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి సత్యప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, మండల జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి, మండల బిజెపి అధ్యక్షులు బొరుసు సుబ్రమణ్యం, రాష్ట్ర టిడిపి నాయకులు అన్నందేవుల చంటి, బిజెపి నియోజకవర్గ నాయకులు ఆకుల శ్రీధర్, ఐఎన్ఏ మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రమణ్యం, పీవీసీ నర్సరీ అధినేత తాడాల చక్రవర్తి, జనసేన నాయకులు ఆదిమూలం సాయిబాబా, రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, సత్యదేవ నర్సరీ యాజమాన్యం పుల్లా చిన సత్యనారాయణ, రాజశేఖర్, వీర్రాజు, వైసీపీ నాయకులు కొత్తపల్లి మూర్తి, సాధనాల బాబ్జీ, కూటమి నాయకులు గట్టి సుబ్బారావు, పుల్లా రామారావు, ప్రత్తిపాటి రామారావు చౌదరి, గుర్రపు కొండయ్య మాస్టారు, సూరపరెడ్డి భరత్, తూము శ్రీనివాసు, చెల్లుబోయిన శ్రీనివాస్, మినర్వా స్కూల్ అధినేత వెంకటేశ్వర రావు, ఫెర్టిలైజర్స్ సయూనియన్ అధ్యక్షులు రావిపాటి రామకృష్ణ, సర్పంచ్ లు చెక్కపల్లి మురళి, కొండపల్లి పట్టియ్య, మారిశెట్టి పద్మావతి , జనసేన, వైసీపీ మహిళా నాయకులు బోడపాటి రాజేశ్వరి, ఊటుకూరి శైలజ, వైసీపీ నాయకులు తోకల శ్రీనివాస్, టేకి శ్రీనివాస్, ముసునూరి రాంబాబు, ధవలేశ్వరం, కడియం సిఐలు వెంకటేశ్వరరావు, గణేష్ , ఎస్సై దుర్గాప్రసాద్, ఏఎస్ఐ రమణ, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సొసైటీ సీఈఓ లు, మండల అధికారులు హాజరయ్యారు.



.jpeg)