Ticker

6/recent/ticker-posts

కుక్కునూరులో ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం


కుక్కునూరు: వై సీ పీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. 

అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాండ్ర రాజేష్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, సామాన్య ప్రజల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందని తెలిపారు.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని పేర్కొన్నారు...ప్రజల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయాలు ప్రతి ఇంటికి చేరయని, పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోందని, భవిష్యత్తులో కూడా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు తాండ్ర రాజేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుంజా నాగేశ్వరరావు రావు వినోద్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లేలా చంటి నాయుడు, మండల ఉపాధ్యక్షుడు మాదిరాజు వెంకన్నబాబు, రాయి సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు చేకూరి నవీన్ వర్మ, ప్రధాన కార్యదర్శి పగిల్లా అల్లేశ్ పగిళ్ళ అనిల్, కుచ్చర్లపాటి చిన్న నరసింహారాజు, చిలకా భానుప్రసాద్, అయిత కోటేశ్వరావు, వసంత్, సాంబ, తాజుద్దీన్, నిమ్మల ప్రసాద్, రెడ్డి మల్ల వాసు, వేల్పుల శ్రీనివాస్, రావి మధు, మాదిరాజు ఖాదర్ బాబా, గూడపాటి ప్రభాకర్, నరసయ్య, గూగులోత్ సత్యనారాయణ, జక్కం నాగేశ్వర్రావు తదితరులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.