Ticker

6/recent/ticker-posts

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకిట్లు పంపిణీ..


కడియం మార్చి 12: కడియం హైస్కూల్‌లో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఎల్‌ఎఫ్‌జేసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సొసైటీ నిర్వాహకులు పాస్టర్ రాబర్ట్ ఉదయ్ కిరణ్, స్థానిక ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ తో కలిసి గురువారం విద్యార్థులకు కిట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అలాగే సొసైటీ తరపున పాఠశాలకు 25 కుర్చీలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, తోరాటి శ్రీనివాస్, చిలుకూరి ప్రభ పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.