సర్వేపల్లి, మార్చి, 10: సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. రెండో రోజు మనుబోలు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి కలిసి విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మనుబోలులో 257 సైకిళ్లు విద్యార్థినులకు అందించారు. SEIL కంపెనీ అందించిన సైకిళ్లతో చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
SEIL కంపెనీ సహకారంతో విద్యార్థినుల కోసం మొత్తం 1841 హీరో సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా 8, 9 తరగతుల విద్యార్థినులకు ఈ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు గుర్తుగా మొత్తం 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. SEIL కంపెనీ సహకారంతో వెంకటాచలం, పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు రూ.1.80 కోట్ల విలువైన పరికరాలు అందించారని చెప్పారు. అలాగే బ్రహ్మదేవంలో రూ.20 కోట్లతో ఆధునిక ఆస్పత్రి నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రిలో వైద్యసేవలు, మందులు, చికిత్సలు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.



.jpeg)