Ticker

6/recent/ticker-posts

కైకలూరులో సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి


కైకలూరు, మార్చి, 10: సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 131వ వర్ధంతి సందర్భంగా కైకలూరులో ఘనంగా నివాళులు అర్పించారు. కైకలూరు పట్టణంలోని కోరుకొల్లు రోడ్డు సెంటర్‌లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కైకలూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ కాలంలో ఆడపిల్లలు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సావిత్రిబాయి పూలే మహిళా విద్య కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. ఆమె చేసిన కృషి వల్లే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు చింతపల్లి వెంకటనారాయణ, కట్ట గోపి, గంగినేని వరప్రసాద్, భలే చిరంజీవి, బోయిన రామకృష్ణ, జక్కుల విజయ్, జనసేన నాయకుడు మైకాపుల రామాంజనేయులు, తుపాకుల సోమాచారి, కట్ట రాఘవలు, బొల్లా శ్యామల రాజు గౌడ్, మీగడ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.